లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ

కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చేరతారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డిని..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ

Danam Nagender

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీ, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చేరతారని ప్రచారం జరుగుతోంది.

రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినాని దానం నాగేందర్ చెబుతున్నారు. వైఎస్సార్, రోశయ్య హయాంలో దానం నాగేందర్ ఆరోగ్యశాఖ మంత్రిగా చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే పలువురు కీలక నేతలు చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే మార్పులు, చేర్పులు భారీగా జరుగుతున్నాయి.

కాగా, ఖైరతాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి నాలుగుసార్లు మాత్రమే ఇతర పార్టీలు గెలిచాయి. ఎన్నికల్లో ఈ నియోజక వర్గంలో 1999లో టీడీపీ గెలిచింది. 2014లో బీజేపీ, 2018, 2023లో బీఆర్ఎస్ గెలిచింది. ఇతర అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. అప్పట్లో ఈ నియోజక వర్గ ఎమ్మెల్యేలుగా గెలిచిన పీజేఆర్, దానం నాగేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా పనిచేశారు.

Kavitha: ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు.. బీఆర్ఎస్ స్పందన