MLC Kavitha: ముగిసిన ఈడీ విచారణ.. 8 గంటలపాటు కవితను ప్రశ్నించిన అధికారులు

భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విచారణ ముగిసింది. ఎన్‭ఫోర్స్‭మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది. అయితే రూల్స్ ప్రకారం సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉండగా..

MLC Kavitha: ముగిసిన ఈడీ విచారణ.. 8 గంటలపాటు కవితను ప్రశ్నించిన అధికారులు

BRS MLC Kavitha's ED investigation end after 8 hours

MLC Kavitha: భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విచారణ ముగిసింది. ఎన్‭ఫోర్స్‭మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది. అయితే రూల్స్ ప్రకారం సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉండగా.. మరో రెండు గంటల పాటు ఆమెను విచారించారు. సమయం దాటినా కవితను బయటికి పంపలేదట. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Swati Maliwal: మా నాన్న చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్

కవితను విచారించడానికి ముందే ఆమె ఫోన్‭ను ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఫోన్ ఈడీ వద్దే ఉంది. మొదట ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు కవితను ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అయితే అది సాయంత్రం 8 వరకు కొనసాగింది. మధ్యలో ఒకసారి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడి ప్రశ్నించింది.

Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడి విచారించినట్లు తెలుస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‭మెంట్‭ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా ఇచ్చిన సమాచారాన్ని కూడా విచారణకు ఈడీ ఉపయోగించుకుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ కింది ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?
2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది..!?
3. ఢిల్లీ గవర్నమెంట్‌కు సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?
4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?
5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?
6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?
7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?
8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?
9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?
10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?
11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?
12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?
13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?
14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?
15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?
16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?
17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?
18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?
19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?
20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..? అని కవితను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Election Commission: ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త వెసులుబాటు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు హాజరయ్యే ముందు ఎమ్మెల్సీ కవిత అందరికీ అభివాదం చేస్తూ ఆఫీసు లోపలికి ప్రవేశించారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లేటపుడు.. కవిత పిడికిలి బిగించి జై కొట్టి వెళ్లారు. కవిత వెనకాలే ఈడీ ఆఫీసు గేట్ వరకూ వచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు. అటు ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కవిత మినహా.. వేరే ఎవరినీ లోనికి అనుమతించలేదు ఢిల్లీ పోలీసులు. ఈడీ ఆఫీసు చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. కవిత వెంట వచ్చిన భర్త అనిల్, అడ్వొకేట్లను కూడా పోలీసులు బయటే నిలిపివేశారు. అటు ఈడీ ఆఫీసు, ఇటు కేసీఆర్ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో నాయకులు గుమిగూడారు.