Telangana Cabinet Meeting: తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బనకచర్ల ప్రాజెక్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు సహా కీలక అంశాలపై చర్చ
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Telangana Cabinet Meeting: తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలి క్యాబినెట్ భేటీ ఇది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల అంశంపై క్యాబినెట్ డిస్కస్ చేస్తోంది.
సీఎం రేవంత్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సమావేశం జరగాలా? లేదంటే మంత్రులు, అధికారుల మధ్య మీటింగ్ జరగాలా? అన్న అంశాన్ని ఫైనలైజ్ చేయనుంది. ఎక్కడ, ఏ రోజు చర్చలు జరపాలి అనేదానిపైనా సమాలోచనలు చేయనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: రూ.3.37 కోట్లు మోసపోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. మహిళ పేరుతో ఆయనను ఎలా నమ్మించారంటే?
క్యాబినెట్ మినిట్స్ కోరుతూ ఇటీవల కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశంపై మంత్రులు చర్చించనున్నారు. రైతు విజయోత్సవ సభల నిర్వహణపైనా నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపైనా క్యాబినెట్ లో చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ అమలు, మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్ట్, కులగణన నివేదిక ఆమోదం వంటి ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అన్ని విభాగాల అధిపతులకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.