Pastor Praveen: నా తల్లిని బతికించు.. అంటూ మృతదేహాన్ని చర్చికి తీసుకొచ్చిన కుమారుడు

తల్లి మృతదేహాన్ని చాలా సేపు అంబులెన్సులోనే ఉంచాడు. ఎన్నో ప్రార్థనలు చేసి, ఎంతో మందిపై కరుణ కురిపించిన పాస్టర్ ప్రవీణ్..

Pastor Praveen: నా తల్లిని బతికించు.. అంటూ మృతదేహాన్ని చర్చికి తీసుకొచ్చిన కుమారుడు

Calvary church bellampally

Updated On : August 25, 2023 / 4:09 PM IST

Pastor Praveen -bellampally: ఆంధ్రప్రదేశ్‌ Andhra Pradesh)లోని రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లి మృతదేహంతో తెలంగాణ(Telangana)లోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి (bellampally) కల్వరి చర్చికి వచ్చాడు. తన తల్లి మృతదేహాన్ని చర్చిలో ఉంచి, ప్రార్థనలు చేసి ఆమెను తిరిగి బతికించాలని, అంతటి గొప్ప మహిమలు పాస్టర్ ప్రవీణ్ కుమార్‌కు ఉన్నాయని తనకు తెలుసని చెప్పాడు.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రార్థనలు చేసి చాలా మంది రోగాలను నిమిషాల వ్యవధిలో పోగొట్టారని ఇందుకు సంబంధించిన వీడియోలను టీవీల్లో చూశానని అన్నాడు. అలాగే ఇప్పుడు తన తల్లి మణికుమారిని కూడా బతికించాలని వేడుకున్నాడు. చాలా సేపు చర్చి గేటు వద్దే ఆయన నిరీక్షించాడు.

తల్లి మృతదేహాన్ని చాలా సేపు అంబులెన్సులోనే ఉంచాడు. టీవీల్లో ఎన్నో ప్రార్థనలు చేసి, ఎంతో మందిపై కరుణ కురిపించిన పాస్టర్ ప్రవీణ్ ఇప్పుడు చర్చిలో నుంచి ఎందుకు బయటకు రావడం లేదని వాపోయాడు. ఆయనను బెల్లంపల్లి కల్వరి చర్చిలోకి పాస్టర్ ప్రవీణ్ అనుచరులు రానివ్వలేదు.

Also Read: కూతురంటే ఎంత ప్రేమో.. ఆ తండ్రి ఏం చేసాడో చూడండి

దీంతో పాస్టర్ల మహిమల గురించి తాను విన్నది, చూసింది అంతా అసత్యమేననుకుంటూ ఆ వ్యక్తి చర్చి నుంచి తిరిగి ఏపీకి వెళ్లిపోయాడు. కాగా, పాస్టర్ ప్రవీణ్ పేరిట యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ‘ దైవజనులు ప్రార్థన చేయగా ఫిట్స్ నుంచి స్వస్థతపరచిన దేవునికే మహిమ కల్గును గాక ‘ అంటూ వీడియోలు ఉన్నాయి. అవి చూసి నిజమనుకుని రాజమహేంద్రవరం నుంచి తన తల్లి మృతదేహాన్ని తీసుకువచ్చానని ఆ భక్తుడు తెలిపాడు.

iBomma : ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారు? ఐబొమ్మలో సినిమాలు చూడటం సేఫేనా?