Outer Ring Road: లారీని గుద్దిన కారు.. చెలరేగిన మంటలు
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధమైంది.

Car
Outer Ring Road, Hyderabad: పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధమైంది. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
మద్యం మత్తులో కారు డ్రైవర్ లారీని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న వాహనదారులు కారులో నుంచి డ్రైవర్‌ని బయటకు లాగారు. దీంతో డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్‌కి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌ని ఆసుపత్రికి తరలించారు అధికారులు.
అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. హయత్ నగర్ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. కారు పూర్తిగా దగ్ధం అవ్వగా.. లారీ కూడా పాక్షికంగా మంటల్లో కాలింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఈసీఐఎల్ దమ్మాయిగూడకు చెందిన మయూర్‌గా గుర్తించారు పోలీసులు.