Case On KTR : కేటీఆర్ పై మరో కేసు నమోదు.. కారణం ఏంటంటే..
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్.

Case On KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు ఫైల్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లారు కేటీఆర్. ఈ ర్యాలీపై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణ..
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ఈ విచారణ జరిగింది. సుమారుగా 6 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ తిరిగి వెళ్తూ పోలీసుల అనుమతి లేకుండా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ చేశారంటూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
ఏసీబీ విచారణ అనంతరం ర్యాలీ..
ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ కారులో బయటకు వచ్చారు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ గేటు వద్ద మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడి నుంచి కేటీఆర్ ను పంపించే ప్రయత్నం చేశారు. అయితే, కేటీఆర్ పోలీసుల మాట వినలేదు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి మీడియాతో మాట్లాడారు.
ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారని ఫిర్యాదు..
అనుమతి లేకుండా రోడ్డు పై మీడియాతో మాట్లాడటమే కాకుండా విధుల్లో ఉన్న తమతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ర్యాలీగా వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయన్న కోణంలోనూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
Also Read : గేమ్‌ఛేంజర్ టికెట్ రేట్ పెంపుపై రాజకీయ రగడ.. సర్కార్ యూటర్న్ తీసుకుందంటూ బీఆర్ఎస్ అటాక్