మెట్రో స్మార్ట్‌ కార్డు ప్రయాణికులకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్

  • Published By: bheemraj ,Published On : November 2, 2020 / 01:56 AM IST
మెట్రో స్మార్ట్‌ కార్డు ప్రయాణికులకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్

Updated On : November 2, 2020 / 10:49 AM IST

Metro smart card : మెట్రో స్మార్ట్‌ కార్డున్న ప్రయాణికులకు క్యాష్‌ బ్యాక్‌ పథకంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎండీ స్పష్ట ఇచ్చింది. స్మార్ట్‌ కార్డ్ కొనుగోలు లేదా రీచార్జీ చేసిన నాటి నుంచి 90 రోజులపాటు క్యాష్‌ బ్యాక్‌ స్కీం వర్తిస్తుంది.



స్మార్ట్‌ కార్డు రీచార్జీని మెట్రో స్టేషన్లలో లేదా పేటీఎం, టీ- సవారీ యాప్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్టేషన్లలో రీచార్జీ చేసిన వెంటనే క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది. యాప్‌ ద్వారా చేసుకుంటే 2 గంటల సమయం పడుతుందన్నారు.



రూ.100 నుంచి రూ.300 మొత్తాన్ని స్మార్ట్‌ కార్డులో రీచార్జీ చేసుకుంటే క్యాష్‌ బ్యాక్‌ వర్తించదు. కానీ ప్రయాణ చార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుంది.



రూ.400 నుంచి రూ.2000 వరకు స్మార్ట్‌కార్డులో రీచార్జీ చేసుకునే వారికి క్యాష్‌ బ్యాక్‌తో పాటు ప్రయాణ చార్జీల్లోనూ 10 శాతం రాయితీ లభిస్తుంది. అంటే కనీసం రూ.400 నుంచి రూ.2000 వరకు రీచార్జీ చేసుకునేవారికే అధిక ప్రయోజనం చేకూరనుంది.