BRS MLC Kavitha : కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి!

BRS MLC Kavitha : ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. కవిత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు ఆమెను కలవనున్నారు.

BRS MLC Kavitha : కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి!

CBI Special Court Gives Permision to Meet Family Members for BRS MLC Kavitha

Updated On : March 16, 2024 / 10:43 PM IST

BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబసభ్యులు కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు సమయాన్ని నిర్ధారించింది. ఈడీ కస్టడీలో ఉన్నంతవరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది.

Read Also : ఎన్నికల వేళ గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తున్న కవిత అరెస్టు పరిణామం

మార్చి 17న కవితను కలిసేందుకు అనుమతి :
అయితే, ఈ క్రమంలో కవిత భర్త భర్త అనిల్‌తో పాటు ఆమె సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఆదివారం (మార్చి 17) సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కవితను కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీని కోర్టు విధించింది. కవిత కోరినట్టుగా స్టేషనరీ, బుక్స్, ఆమె కళ్లద్దాలు అందించాలని సూచించింది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కవితను విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

అంతేకాదు.. విచారణకు సంబంధించి వీడియో రూపంలో రికార్డ్ చేయాలని ఈడీని ఆదేశించింది. అలాగే, కవితకు ఆమె ఇంటి దగ్గర నుంచి భోజనం పంపించేలా అనుమతిని ఇచ్చింది. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.

Read Also : Aruri Ramesh : బీఆర్ఎస్‌కు వరుస షాకులు.. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా!