Vamshi Chand Reddy
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తప్పు చేయలేదని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజల కన్నీటి గాధలు చెప్పుకుంటే పోతే చాంతాడంత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహబూబ్ నగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం మోసం చేసిందని చెప్పారు. పోటీకి వస్తే ఎవరు చెప్పేది నిజమో ప్రజలే తేల్చుతారని అన్నారు. కృష్ణాలో తెలంగాణకు కేటాయించిన నీటిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకోలేదని చెప్పారు.
కేసీఆర్ అసమర్థ నాయకత్వం వల్ల కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పాలమూరు అంటే కేసీఆర్‌కు నచ్చదన చెప్పారు. మరోసారి మోసం చేయడానికే బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటన చేపట్టిందని అన్నారు. రేపు పాలమూరులో బీఆర్ఎస్ ప్రభుత్వ బండారాన్ని బయటపెడతామని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్