వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ భావిస్తున్నారు.

Andhra Pradesh IAS officer Imtiaz joins ysr congress party
IAS officer Imtiaz: ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్ పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ స్వాగతించారు. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఇంతియాజ్ భావిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు.
Also Read: నేను ఎవర్నీ అలా కావాలని అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు..