Chandanagar jewellry case
Chandanagar jewellry case: హైదరాబాద్‌లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ (Chandanagar jewellry case)లోకి మంగళవారం దుండుగులు తుపాకీలతో చొరబడి కాల్పులు జరిపిన ఘటన రాష్ట్రం సంచలనం సృష్టించింది.
మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో ఆరుగు ముఠా కలిగిన దుండగులు జ్యువెలరీ షాపులోకి చొరబడి సిబ్బందిని బెదిరించారు. షాపులో సీసీ కెమెరాలను ధ్వంసంచేసి.. ఎదురు తిరిగిన వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జ్యూవెలరీ దుకాణాలో పనిచేసే ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే, ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.
Also Read: చందానగర్ ఖజానా జ్యూవెలరీ షాపులో దోపిడీ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఎంత బంగారం దోచుకెళ్లారంటే..?
జ్యువెలరీ షాపు (Chandanagar jewellry case) ఘటనలో ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం 12బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులు వెళ్లిన దారుల్లో సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. చందానగర్ నుంచి బీరంగూడ- జిన్నారం -పట్పల్లి మీదుగా బీదర్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కర్ణాటక పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు.
దోపిడీకి ముందు నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రెండు బైక్ లపై వచ్చి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారిని గుర్తించేందుకు 100 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ఓ పోలీస్ బృందం బీదర వెళ్లింది. దుండగుల ఆచూకీ తెలుసుకునేందుకు అన్నివిధాల పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.