సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది?: చికోటి ప్రవీణ్

Chikoti Praveen: తన ఫామ్ హౌస్ పై దాడులు చేసి మాదక ద్రవ్యాల కేసులు పెడుతా అని బెదిరించారని చికోటి ప్రవీణ్ చెప్పారు.

సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది?: చికోటి ప్రవీణ్

Chikoti Praveen

Phone Tapping Case: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై డీజీపీకి క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు బీఆర్ఎస్ అండతో రెచ్చిపోయి అనేక అరాచకాలు చేశారని అన్నారు. సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

గజ్వేల్లో శివాజీ విగ్రహం విషయంలో గొడవ జరిగిన సమయంలో తాను అక్కడకు వెళ్లానని, తనకు కాల్ చేసి పీడీ యాక్టులు పెడతానని బెదిరించారని చెప్పారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి తన కదలికలను కనిపెట్టారని అన్నారు. తాను అమ్మవారి గుడికి వెళ్తే తన అనుచరుల దగ్గర గన్స్ ఉన్నాయంటూ తనపై రాధాకిషన్ రావు అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు.

తన ఫామ్ హౌస్ పై దాడులు చేసి మాదక ద్రవ్యాల కేసులు పెడుతా అని బెదిరించారని చికోటి ప్రవీణ్ చెప్పారు. రాధాకిషన్ రావుకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. రాధాకిషన్ రావు ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయించాలని అన్నారు. రాధాకిషన్ రావు తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు.

 Also Read: ఇక్కడ బీజేపీతోనే మనకు పోటీ.. ఇది అందరికీ తెలుసు: కేటీఆర్