ఇక్కడ బీజేపీతోనే మనకు పోటీ.. ఇది అందరికీ తెలుసు: కేటీఆర్

KTR: రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా అని కేటీఆర్ అన్నారు.

ఇక్కడ బీజేపీతోనే మనకు పోటీ.. ఇది అందరికీ తెలుసు: కేటీఆర్

KTR

బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాలని తమ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి తమ మీద రుద్దే ప్రయత్నం చేసిందని చెప్పారు. మల్కాజ్ గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్‌కు పోటీ అని, ఇది అందరికీ తెలుసని అన్నారు.

బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. పదేళ్లలో దేశానికి ప్రధాని మోదీ చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపారని అన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి దమ్ముంటే మోదీ మల్కాజ్ గిరికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాలు విసిరారు.

పదేళ్లు కంటోన్మెంట్లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. తెలుగు అధికారి గిరిధర్ వల్లే ఆ ఫైల్ కదిలిందని చెప్పారు. గత ఎన్నికల్లో గెలుస్తానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదని, కానీ అదృష్టం కొద్దీ గెలిచారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే విద్యార్థులు ఆ పార్టీ అంతు చూస్తారని చెప్పారు.

రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా అని కేటీఆర్ అన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేయలేదని, నిజమైన హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయడని హితవు పలికారు. మల్కాజ్ గిరిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

Also Read: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. పవన్‌పై ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా?