వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు.. సీఎం రిలీఫ్ ఫండ్లో భారీ స్కామ్
28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సీఐడీ. హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో పలు ఆసుపత్రుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

Cm Relief Fund Scam : తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ తో భారీ స్కామ్ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి సర్కార్ సొత్తును కాజేశారు. సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. సీఐడీ విచారణలో నివ్వెరపోయే అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు కాజేసినట్లు తెలిసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వ సొత్తును కొట్టేసినట్లు సీఐడీ గుర్తించింది. దీంతో 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సీఐడీ. హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో పలు ఆసుపత్రుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.
Also Read : తెలంగాణలో రూట్ మార్చిన కాంగ్రెస్ పార్టీ సర్కారు.. గులాబీ నేతలకు కొత్త టెన్షన్!
వందల కోట్ల రూపాయల నిధులు స్వాహా..
CMRF స్కాంపై సీఐడీ 6 కేసులు నమోదు చేసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లుగా బిల్లులు చేసి ప్రభుత్వ సొత్తు కాజేసిన మొత్తం 28 ఆసుపత్రుల పై కేసులు నమోదు చేసిన సిఐడి. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. 30 ఆస్పత్రులు నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 30 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా చేశారని సీఐడీ నిర్ధారించింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని గుర్తించారు. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసింది సీఐడీ. 30 ఆసుపత్రులపై విచారణ ముమ్మరం చేసింది సీఐడీ.
నకిలీ బిల్లులతో ఘరానా మోసం..
వైద్యం చేయకపోయినా చేసినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల గండికొట్టాయి. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ స్కామ్ లో సీఐడీ అధికారులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సచివాలయంలో పని చేసే సీఎంఆర్ఎఫ్ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్న పిల్లలకు వైద్యం చేయకపోయినా చేసినట్లుగా అక్రమ బిల్లులు సృష్టించి ప్రైవేట్ ఆసుపత్రులు ఈ దందా చేశాయి. 30 ఆసుపత్రులకు సంబంధించి దర్యాఫ్తు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాన్ని సీఐడీ అధికారులు విచారించారు. మరికొన్ని రోజుల్లో వారందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.