TS Assembly Sessions : సభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారు-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వెలిబుచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని...సభా గౌరవాన్ని స్పీకర్ మంట గలిపారని

Ts Assembly Clp Leaders
TS Assembly Sessions : శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వెలిబుచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని…సభా గౌరవాన్ని స్పీకర్ మంట గలిపారని ఆయన అన్నారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మల్లు మాట్లాడుతూ……అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా?ఇష్టానుసారం సభ నడుపడం సరికాదు సభాపతి’ని చూసి నేను సిగ్గుపడుతున్నా మెడ పై కాలేసి తొక్కినట్లు చేస్తున్నారు.మేము కూడా గెలిచే వచ్చామని ఆయన అన్నారు.
ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం డైరెక్షన్ లో స్పీకర్ బొమ్మలా యాక్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకే సభలో మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల గొంతు నొక్కినట్లే రాష్ట్రంలో గూండా, రౌడి పాలన సాగుతోందనిజగ్గారెడ్డి ఆరోపించారు. కేసిఆర్ గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారని… ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదని..ప్రజలే కాంగ్రెస్‌ను కాపాడుకోవాలని జగ్గారెడ్డి చెప్పారు.
మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని… రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ఈ రోజు మాకు జరిగిన అవమానం తెలంగాణ ప్రజలకు జరిగినట్లని ఆయన అన్నారు.
దళితుడు సిఎల్పీ నేతగా ఉంటే కేసిఆర్ ఓర్చుకోలేక పోయారని రాజగోపాల రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం దురదృష్టం,ఇది తెలంగాణ రాష్ట్రమా? రాజ్యమా? రాష్ట్రాన్ని కేసిఆర్ కుటుంబం పాలిస్తోందని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడవని కేసిఆర్..దేశాన్ని ఉద్దరిస్తా అని బయలు దేరిండని.. నియంత కేసిఆర్ కు బుద్ది చెప్పాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : Telangana : రూ. 2.56 లక్షలతో తెలంగాణ బడ్జెట్, కేటాయింపులు దేనికి ఎంత?
అసెంబ్లీ నీ టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. స్పీకర్ లు బంట్రోతులా మారుతున్నరా?సమైక్య రాష్ట్రంలో కూడా స్పీకర్‌లు ఇలా ప్రవర్తించ లేదని…స్పీకర్‌కు ప్రతిపక్షాల మీద చిన్నచూపు ఉందని ఆయన అన్నారు. మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే గమ్మున కూర్చుంది..పాయింట్ ఆర్డర్ లేవనెత్తితే కూడా మా మొహం చూడలేదు.కాంగ్రెస్‌కు జరిగిన అవమానంపై పోరాటం చేస్తాం…మా గొంతు నొక్కడం అంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ను అవమానించడమే అని సీతక్క అన్నారు.