Revanth Reddy : సోనియా గాంధీ అలా చేయకపోయుంటే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునే వారు- రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? Revanth Reddy

Revanth Reddy : సోనియా గాంధీ అలా చేయకపోయుంటే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునే వారు- రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Fires On KCR (Photo : Facebook, Google)

Updated On : October 19, 2023 / 7:35 PM IST

Revanth Reddy Fires On KCR : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కనుక తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునే వారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.

మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు..
” నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించిన కేసీఆర్ మళ్లీ మూడోసారి అధికారం కోసం మీ ముందుకు వస్తున్నారు. రైతు రాజ్యం అని చెప్పి రైతును నట్టేట ముంచిన కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్న కేసీఆర్… సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా? సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునే వారు.

Also Read : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

పదేళ్లలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది?
యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా?

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు..
తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్ధిక సాయం. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు రూ.12వేలు అందించనున్నాం. పెన్షన్ రూ.4వేలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?