CM KCR : కేసీఆర్ చెప్పాడంటే శిలాశాసనమే, ఆరు నూరైనా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : సీఎం కేసీఆర్
ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో..తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని..డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రా అని గుర్తించాలి అంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.

CM KCR in Sathupalli sabha
CM KCR in Sathupalli sabha : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంట్లో భాగంగా ఓ పక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపీ పార్టీలపై సభల్లో తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. దీంట్లో భాగంగా సత్తుపల్లి సభలో మరోసారి బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య మరోసారి గెలుస్తాడని అన్నారు. కేసీఆర్ చెబితే అది శిలాశాసనమే అన్నారు. మూడోసారి కూడా ఆరు నూరైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే..మరోసారి కారు ప్రభుత్వమే వస్తుందని..బీఆర్ఎస్ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పోరాటం కాదు పార్టీల మధ్యే పోరాటమన్నారు.
CM KCR : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్
ఖమ్మం ఏపీ సరిహద్దులో ఉన్న జిల్లా.. ఇక్కడి ప్రజలు ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో..తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని సూచించారు. డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రా అని గుర్తించాలి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి,రైతు బంధు, కరెంటు ఇవేవీ ఉండవన్నారు. ఇవే కాకుండా తెలంగాణాను మరింత అభివృద్ది చేసుకోవాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.