CM KCR : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Cm Kcr Good News For Nursing Students
CM KCR Nursing Students : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫస్టియర్ వారికి ప్రస్తుతం రూ.1500 లు ఇస్తారు. ఇకపై రూ.5వేలు ఇవ్వనున్నారు. సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1700 ఇస్తున్నారు. ఇకపై వారికి రూ.6వేలు ఇవ్వనున్నారు. థర్డియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1900 ఇస్తున్నారు. ఇకపై వారికి రూ.7వేలు ఇవ్వనున్నారు. స్టైఫండ్ పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అటు రాష్ట్రంలో కొత్తగా 11 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. సిరిసిల్లా జిల్లాకు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత మండేపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చ్ కేంద్రం, నర్సింగ్ కాలేజీలను ప్రారంభించారు.
చేనేత కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతుబీమా తరహాలో త్వరలో చేనేత కార్మికులకూ ఓ పథకం తీసుకొస్తామని ప్రకటించారు. అందులో చేనేత కార్మికునికి రూ.5లక్షల బీమా అందజేస్తామన్నారు. చేనేత కార్మికులు, మరమగ్గాల వారు మరణిస్తే వారి
కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇస్తామన్నారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించారు. అటు 57ఏళ్లు నిండిన వారందరికీ వృద్దాప్య పింఛన్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పూర్తవగానే కొత్త పెన్షన్ విధానం అమలు
చేస్తామన్నారు.
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. గోదావరినే 500 మీటర్లు పైకి తెచ్చాం.. ఎస్సీలను పైకి తేలేమా? ఎస్సీల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45వేల కోట్లు ఖర్చు
చేయబోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.