అవసరమైతే కరోనా నివారణకు రూ.5 వేల కోట్లు ఖర్చు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు.

కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు.
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందని..వైద్య అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. హైదరాబాద్ లో మరో ఇద్దిరికి కరోనా లక్షణాలున్నాయని తెలిపారు. పూర్తి రిపోర్టులు వచ్చాకే స్పష్టత వస్తుందన్నారు. శనివారం (మార్చి 14, 2020) కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా 65 మంది కరోనా బాధితుల్లో 10 మందికి కరోనాను జయించారని తెలిపారు. కరోనాతో దేశంలో ఇద్దరు మాత్రమే చనిపోయారని అన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.
హైదరాబాద్ లోని బాధితుడు కోలుకున్నాడని.. ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైందన్నారు. హైదరాబాద్ లో ఇవాళ మరో కేసు పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రద్దీ పెరిగిందన్నారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా జాగ్రత్తులు తీసుకున్నామని తెలిపారు. విదేశాల నుంచి వస్తున్నవారే ఈ వైరస్ ను తెస్తున్నారని…విదేశాల నుంచి ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నారో తెలియదన్నారు. ప్రజలు భయపడతారని అన్ని వివరాలు తాము చెప్పటం లేదన్నారు. వారం రోజుల నుంచే తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. 200 మంది ఆరోగ్య సిబ్బందిని ఎయిర్ పోర్టుతో ఉంచామని చెప్పారు.
వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద తప్పవుతుందన్నారు. స్కూళ్ల మూసివేతపై ఓ అవగాహనకు రావాలన్నారు. సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశం ఉందని…స్కూళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ మీటింగ్ ప్రస్తుతం జరుగుతుందన్నారు. అన్ని కార్పొరేషన్లలో స్కూల్స్, థియేటర్లు మూసివేతపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.