CM KCR : బండి సంజయ్ నువ్వేమన్న ట్రాక్టర్ డ్రైవర్‌వా – కేసీఆర్
బండి సంజయ్ నువ్వో తోకగాడివి..నా ఫాంహౌజ్ దున్నుతా అంటున్నావ్.. నువ్వేమన్నా ట్రాక్టర్ డ్రైవర్ వా? అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు.

Cm Kcr (2)
CM KCR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ఫాంహౌజ్ దున్నుతానని చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. బండి సంజయ్ నువ్వో నా ఫాంహౌజ్ దున్నుతా అంటున్నావ్.. నువ్వేమన్నా ట్రాక్టర్ డ్రైవర్ వా? అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బీజేపీ నేతలపై నిప్పులుచెరిగారు. నాది ఫాంహౌజ్ కాదు.. ఫార్మర్ హౌజ్ అది అని చెప్పారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నానని స్పష్టంచేశారు.
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ అసలు విషయం పక్కకు పెట్టి అనవసర విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ పొలాలు అప్పర్‌మానేరు ప్రాజెక్టు కింద పొతే ఇంకోచోట భూములు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నామని అందుకే ఫాంహౌజ్‌కు వస్తే మెడలు ఇరగ్గొడతా అన్నా అని బండి సంజయ్‌నుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తామెప్పుడూ ప్రజలు బాగుండాలనే కోరుకుంటామని, మీలాగా చీప్‌గా వ్యవహరించమని చెప్పారు.
చదవండి : CM KCR Press Meet : ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా – కేసీఆర్