సానుభూతితోనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు..బీజేపీ గురించి ఆందోళన అవసరం లేదు : సీఎం కేసీఆర్

  • Published By: bheemraj ,Published On : November 12, 2020 / 10:13 PM IST
సానుభూతితోనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు..బీజేపీ గురించి ఆందోళన అవసరం లేదు : సీఎం కేసీఆర్

Updated On : November 13, 2020 / 7:08 AM IST

CM KCR review meeting : సానుభూతితోనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచాడని.. బీజేపీ గురించి ఎక్కువ ఆందోళన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రులతో అన్నట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల సన్నద్దతపై మంత్రులు, కార్యదర్శులతో గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై చర్చించారు.



గతంలో పోటీ చేసి ఓడి పోయిన కారణంగానే నియోజకవర్గంలో ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతి వచ్చిందని..ఈ కారణంగానే రఘునందన్ కు విజయం దక్కిందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోరాదన్న విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.



దుబ్బాకలో బీజేపీ విజయం సాధించినంత మాత్రాన గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి గెలిచే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద స్థానాల్లో గెలిచేందుకు దిశానిర్దేశం చేసినట్లు కనిపిస్తోంది.



రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరం అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. నగర వాసులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించబోతున్నారని సమాచారం.