CM KCR: సిద్దిపేట కలక్టరేట్‌ను జూన్20న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR: సిద్దిపేట కలక్టరేట్‌ను జూన్20న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Cm Kcr To Inaugurate Siddipet Collectorate On June 20

Updated On : June 14, 2021 / 10:50 PM IST

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సిద్ధిపేట కలక్టరేట్ ప్రారంభించనున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామి రెడ్డి అన్నారు. ఈ మేరకు న్యూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కు ఫైల్స్ మొత్తం తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొత్త ఆఫీసు ఓపెన్ అయ్యేంత వరకూ.. పబ్లిక్ గ్రీవెన్సులు ఏమైనా ఉంటే జూన్ 20వరకూ పాత ఆఫీసులోనే కాంటాక్ట్ చేయాలని తెలిపారు.

అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బీ చెన్నైలతో మీటింగ్ అయ్యారు. కొత్త కలక్టరేట్ కు ఆఫీసులు కచ్చితంగా తరలించాలని ఈ సందర్భంగా అన్నారు. ఇదిలా ఉంటే అదే రోజున సిద్ధిపేట కొత్త పోలీస్ కమిషనరేట్ ను కూడా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

అక్టోబరు 2016న తెలంగాణ కొత్త జిల్లాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. కలెక్టరేట్లు, పోలీస్ హెడ్ క్వార్టర్లను తాత్కాలికంగా కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ.. కలెక్టరేట్లు, పోలీస్ హెడ్ క్వార్టర్లను కొత్త నిర్మించుకోవాలని చెప్పింది. ఈ మేరకే సిద్ధిపేటలో కలెక్టరేట్, కమిషనరేట్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నారు.