Chiranjeevi- Revanth Reddy : మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్?

చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

Chiranjeevi- Revanth Reddy : మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్?

CM Revanth Reddy bumper offer to Megastar Chiranjeevi

Updated On : August 7, 2025 / 12:57 PM IST

చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారని.. లేకపోతే ఏపీలో జనసేనలో యాక్టీవ్ అయి తమ్ముడితో కలిసి పనిచేస్తారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి వేడుకల సందర్భంగా.. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట్లో ప్రధాని మోదీతో డయాస్ షేర్ చేసుకున్న సందర్భంలోనూ చిరు పొలిటికల్ రీఎంట్రీపై చర్చ జరిగింది.

బీజేపీ ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేసిందని.. కేంద్రమంత్రిని చేస్తామని భరోసా ఇచ్చిందని కూడా టాక్ నడిచింది. అయితే ఇక నో పాలిటిక్స్‌.. ఓన్లీ సినిమాస్‌ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చిరంజీవి. లేటెస్ట్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని చిరంజీవి కలిశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ వేళ రేవంత్, చిరు భేటీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. జూబ్లీహిల్స్ బైపోల్‌ బరిలో మెగాస్టార్ చిరంజీవిని దింపాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ అంటున్నారు.

రైతులకు శుభవార్త.. రాష్ట్రంలోని ఆ ప్రాంతాల్లో కొత్త మార్కెట్ యార్డులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. ప్రాంతాలు ఇవే..

ఆ ఉద్దేశంతోనే చిరును ప్రత్యేకంగా ఆహ్వానించి తన నివాసంలో భేటీ అయ్యారట సీఎం రేవంత్. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్ జరిగిందని అంటున్నారు. అక్కడ తమ్ముడు.. ఇక్కడ అన్నయ్య..పొలిటికల్‌గా ఇద్దరు చెరో రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉండొచ్చనే అస్త్రాన్ని వాడారట రేవంత్. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే తెలంగాణలో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు నైజాంలోనే ఎక్కువ కలెక్షన్స్ ఉండేవి. ఇదే ప్లాన్‌తో చిరుకు జూబ్లీహిల్స్‌ బైపోల్ టికెట్ ఆఫర్ చేశారు రేవంత్. అంతేకాదు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇస్తానని చెప్పారట. భవిష్యత్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో..చిరు అనే అస్త్రాన్ని వాడుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఆయన చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయి డిస్కస్ చేశారట. పైగా ఇప్పటికే చిరంజీవి కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఉపాసనను కో ఛైర్మన్‌గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీరియస్‌ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్..సర్వేల్లో రిపోర్ట్‌ల్లో వెనుకబడిందట. అందుకే చిరంజీవిని బరిలోకి దింపితే సినీ గ్లామర్‌, ఆయనకున్న క్రేజ్, పరిచయాలతో ఈజీగా గెలువొచ్చని రేవంత్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై చిరంజీవితో డిస్కస్ చేసి..ఆయన అభిప్రాయమేంటో అధిష్టానానికి సమాచారం చేరవేశారట రేవంత్. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చిరంజీవి గెలిస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాదు..డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారట. అంతే కాదు అన్నీ అనుకున్నట్లు కుదిరితే తెలంగాణ హోంమంత్రి పోస్ట్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తామని చిరంజీవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్‌రెడ్డి. ఆల్రెడీ భట్టి డిప్యూటీ సీఎంగా ఉండగానే మరో ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే వెసులు ఉండటంతో రేవంత్‌..చిరుకు డిప్యూటీ సీఎం పోస్ట్‌ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం పాలిటిక్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ పెడుతూ..తన పని తాను చేసుకుంటున్నారు చిరంజీవి. అయితే సీఎం రేవంత్‌తో భేటీ తర్వాత జూబ్లీహిల్స్ బరిలో చిరు అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. యూపీఏ-2లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అయితే చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలను దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న టాక్‌ అటు ఇండస్ట్రీలో ఇటు పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ ఇష్యూ అయింది.

అయితే సీఎం రేవంత్‌తో భేటీలో తన ఒపీనియన్‌ ఏంటో క్లియర్‌ కట్‌గా చెప్పేశారట చిరు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవట్లేదని..సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పోస్ట్‌ ఆఫర్‌ను కూడా మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారట. అయితే అప్పటికే చిరంజీవి జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతుండటంతో..ఆ తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మరింత క్లారిటీ ఇచ్చేశారు. రాజ‌కీయాల‌కు తాను దూరంగా ఉన్నట్టు చెప్పారు. పాలిటిక్స్‌లో త‌న‌కు మిత్రులు, శ‌త్రువులు అంటూ ప్రత్యేకంగా ఎవ‌రూ లేర‌న్న ఆయ‌న‌..త‌న‌కు పాలిటిక్స్‌ అంత‌గా ప‌డ‌లేద‌న్నారు. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో చిరు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసినట్లు అయింది.