రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని వేణుగోపాల్, అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు.

Cm Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని వేణుగోపాల్, అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో వారు చర్చలు జరిపారు. కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నారని సిబ్బంది తెలపడంతో అక్కడికి వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇక జూన్ 2న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు రానున్నారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగించనున్నారు. 5 నిమిషాల పాటు సోనియా గాంధీ ప్రసంగం ఉండనుంది.
Also Read : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల వేళ ముదురుతున్న వివాదం