CM Revanth Reddy : నెక్ట్స్ ఐఏఎస్, ఐపీఎస్‌లనే..! పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ప్రక్షాళన, వరుసగా సంచలన నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారని చెప్పాలి. పరిపాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల రద్దు ఇందులో భాగమే అంటున్నారు.

CM Revanth Reddy Mark Administration
సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ వేస్తున్నారు. పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. నిన్న ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇవాళ 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు, పదవీ కాలం నిర్ణయాలను రద్దు చేసింది రేవంత్ సర్కార్. 54 కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిన్న(డిసెంబర్ 9) తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురు సలహాదారుల నియామకాలను సీఎస్ రద్దు చేశారు. ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ సోమేశ్ కుమార్, మైనార్టీస్ వెల్ఫేర్ అడ్వైజర్ ఏకే ఖాన్, ఫైనాన్స్ అడ్వైజర్ జీఆర్ రెడ్డి, అగ్రికల్చర్ చీఫ్ అడ్వైజర్ చెన్నమనేని రమేశ్ తో పాటు ఆర్ శోభ, అనురాగ్ శర్మ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్.
Also Read : టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారని చెప్పాలి. పరిపాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల రద్దు ఇందులో భాగమే అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి మార్క్ నియామకాలకు రంగం సిద్ధం చేశారు. అధికార యంత్రాంగం నియామకాలపైనే దృష్టి పెట్టారు. రేపో మాపో ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే.. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చటమే కాకుండా.. ప్రజాదర్బార్ కూడా నిర్వహిస్తోంది. 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను సైతం అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు.. వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసిన సర్కార్.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వివిధ శాఖల కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ఆదేశాలతో 54 మంది కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల నియామకాలు రద్దయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. 17 కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేసేశారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?
కాగా.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురు మాజీ ఐఏఎస్ అధికారులను ఇదివరకే ప్రభుత్వం తొలిగించింది. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను కూడా రద్దు చేసింది. ఈరోజు(డిసెంబర్ 10) కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు కూడా రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన ప్రారంభించేశారనే టాక్ నడుస్తోంది.