రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ..

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

CM Revanth Reddy

Updated On : September 13, 2024 / 9:39 AM IST

లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సర్కారుని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇవాళ మరో కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.

పోలీస్ శాఖలో భారీ మార్పులు?
పోలీస్ శాఖలో మరోసారి భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఐజీలు, సీపీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి భారీ మార్పులు చేయొచ్చని తెలుస్తోంది.

Also Read: ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య కొనసాగుతున్న వివాదం