ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య కొనసాగుతున్న వివాదం

తాను బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అని గాంధీ వ్యాఖ్యలు చేయడంతో ఆయన నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు..

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య కొనసాగుతున్న వివాదం

Updated On : September 13, 2024 / 8:05 AM IST

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య వివాదం కొనసాగుతోంది. గత అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసుల అదుపులోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇవాళ మరో కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు.

తాను బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అని గాంధీ వ్యాఖ్యలు చేయడంతో ఆయన నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అంటోంది.

మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు సమావేశానికి హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ చెబుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ర్యాలీగా బయలుదేరుతుంది.

Also Read: బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారికి హైకమాండ్ కఠిన పరీక్ష..! ఏంటా పరీక్ష..?