బీఆర్ఎస్‌కు మరో షాక్..! కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు.

Joinings In Congress : అధికార కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రేపు(జూలై 12) కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ప్రకాశ్ గౌడ్ ఒకసారి సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తిరుపతి వెళ్లారు. రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ రానున్నారు. రేపు సాయంత్రం 7 గంటలకు ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, 8మంది ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. ప్రకాశ్ గౌడ్ నిన్న, మొన్న రెండు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సన్నద్ధం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ముఖ్యమైన కార్యకర్తలకు ఆయన సమాచారం ఇచ్చారు. కాగా, మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
Also Read : మళ్లీ టీడీపీ గూటికి? అసలు మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎందుకు చంద్రబాబు వైపు చూస్తున్నారు?