వారితో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వారితో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

CM Revanth Reddy Comments On D Srinivas Demise : ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో ఆదివారం డీఎస్ అంత్యక్రియలు జరిగాయి. నిజామాబాద్ లోని డీఎస్ స్వగృహంలో ఆయన పార్దీవదేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని, 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Also Read : బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి

విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్ లో డీఎస్ ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారని రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చామని తెలిపారు. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.