CM Revanth Reddy : విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy : విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

CM Revanth Reddy Serious

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం చాలా సీరియస్ గా సాగింది. విద్యుత్ శాఖపై రివ్యూ సీరియస్ గా సాగింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

Also Read : 24గంటల విద్యుత్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

రేపటిలోగా(డిసెంబర్ 8) పూర్తి వివరాలతో రావాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రేపు(డిసెంబర్ 8) ఉదయం విద్యుత్ పై సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు చెప్పారు అధికారులు. మరోవైపు ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Also Read : కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. అమలు ఎలా? ఎంత డబ్బు కావాలి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి రావ్ పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష చేయనున్నారు. 2014 నుండి విద్యుత్ శాఖలో జరిగిన కొనుగోళ్లపై పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.