రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని రేవంత్ అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

PM Modi Telangana Tour : రాష్ట్రం అభివృద్ధికోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అదిలాబాద్ జిల్లాకు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వాగతం పలికారు. అదిలాబాద్ లో వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మోదీతో కలిసి సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడి తరువాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతున్న రేవంత్ చెప్పారు.

Also Read : ఎల్ఆర్ఎస్‌పై న్యాయ పోరాటం చేస్తాం.. 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు : కేటీఆర్

కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలని, ప్రధాని మోదీ అంటే మాకు పెద్దన్నలాంటి వారని రేవంత్ అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. విభజన హామీ మేరకు ఎన్టీపీసీ 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని రేవంత్ అన్నారు. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగు నిండనున్నాయని రేవంత్ చెప్పారు. స్కై వేల ఏర్పాటు, టెక్స్ టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పనందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన రేవంత్.. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల మా ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందని  అన్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరుతున్నానని, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలన్నదే మా విధానం.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఉండాలని ప్రధానిని కోరుతున్నానని రేవంత్ అన్నారు.