ఎల్ఆర్ఎస్‌పై న్యాయ పోరాటం చేస్తాం.. 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు : కేటీఆర్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్ఆర్ఎస్‌పై న్యాయ పోరాటం చేస్తాం.. 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు : కేటీఆర్

BRS Leader KTR

BRS Leader KTR : ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ ఆమేరకు ప్రభుత్వం చర్యలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ఎల్ఆర్ఎస్ పథకంపై కాంగ్రెస్ విధానం ప్రజలపై భారం మోపే విధంగా ఉందని అన్నారు. ఎల్ఆర్ఎస్ కు  బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20లక్షల 40వేల అప్లికేషన్స్ వచ్చాయని, ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని కేటీఆర్ తెలిపారు. అప్పట్లో ఎల్ఆర్ఎస్ పై ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టులో కేసు వేశారని, ఎల్ఆర్ఎస్ పథకంకు ఎవరు కట్టవద్దని ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఎల్ఆర్ఎస్.. నో టీఆర్ఎస్ అని పిలుపునిచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.

Also Read : ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా భూములను క్రమబద్దీకరణ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మార్చి 31లోపు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజల దగ్గర దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్ పెట్టారని  సీతక్క అనలేదా?. ప్రజల నుండి ఎల్ఆర్ఎస్ ద్వారా 20వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిందని కేటీఆర్ ఆరోపించారు. కోమటిరెడ్డి కోర్టులో వేసిన పిల్ ఏమైంది? కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ప్రజలకు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read : CM Revanth Reddy: ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు: రేవంత్ రెడ్డి

ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టారు. ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయలకు భారం పడే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజా నిర్ణయం 25లక్షల కుటుంబాలపై ఎల్ఆర్ఎస్ భారం పడబోతోంది. కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఈనెల 6వ తేదీన అన్నినియోజకవర్గాల్లో, హైదరాబాద్ నగరంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని కేటీఆర్ చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని, ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మాటమార్చిందంటూ కేటీఆర్ విమర్శించారు.