మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
మూసీ ప్రక్షాళనకు మద్దతుగా ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని రైతులతో మాట్లాడబోతున్నారు.

Cm Revanth Reddy (Photo Credit : Google)
Cm Revanth Reddy : మూసీ పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 8న వలిగొండ మండలం సంగెంలో పర్యటించబోతున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ రైతులతో పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 8న ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లబోతున్న సీఎం రేవంత్.. స్వామి వారి దర్శనం అనంతరం మూసీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళనకు మద్దతుగా ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని రైతులతో మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే భువనగిరి, తుంగతుర్తి, ముసీ పరివాహక ప్రాంతాల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా చైతన్య యాత్రను పూర్తి చేశారు.
ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అదే రోజున యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించబోతున్నారు. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం చాలా స్పీడ్ గా ముందుకెళ్తోంది.
మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయిపోయింది. వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కాగా, పునరుజ్జీవ పనులకు బీఆర్ఎస్ అడ్డు పడుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అనంత గిరి కొండల నుంచి మొదలు నల్గొండ సూర్యాపేట వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న మూసీ పూర్తిగా కాలుష్య కాసారంగా మారింది.
దీంతో నల్గొండ జిల్లా రైతులపై ప్రభావం పడుతోంది. అక్కడ పండించే పంటలు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతోంది. ఈ నెల 8న యాదాద్రి ఆలయం సందర్శన అనంతరం.. మూసీ పరివాహక ప్రాంతం వలిగొండ మండలంలో పర్యటించబోతున్నారు. మూసీ పరిరక్షణకు సంబంధించి ప్రజల మద్దతు కోసం ప్రజా చైతన్య యాత్రను నల్గొండ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టారు. ఇప్పటికే తుంగతుర్తి, సూర్యాపేటలో ప్రజా చైతన్య యాత్రను ముగించారు.
మూడో దశగా భువనగిరి నుంచి ఆయన యాత్ర చేయబోతున్నారు. అందులో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. వలిగొండ మండలం సంగెంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి కొంత దూరం ప్రజా చైతన్య యాత్రలో రైతులతో కలిసి నడవబోతున్నారు. రైతులతో మాట్లాడబోతున్నారు. మూసీ కాలుష్యంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కనీసం వరి చేనులోకి దిగే పరిస్థితి లేకుండా పోయింది. అంతగా మూసీ కలుషితమైపోయింది. ఈ క్రమంలో మూసీని ప్రక్షాళన చేయాలా వద్దా అని రైతులను అడిగి తెలుసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత..