Cock Fight : రంగారెడ్డి జిల్లాలో బహిరంగ కోడి పందాలు.. పది మంది అరెస్ట్

కోడి పందాల సంప్రదాయం తెలంగాణకు పాకింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాదర్గుల్ వద్ద బహిరంగ కోడి పందాలు నిర్వహిస్తుండగా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు

Cock Fight : రంగారెడ్డి జిల్లాలో బహిరంగ కోడి పందాలు.. పది మంది అరెస్ట్

Cock Fight

Cock Fight : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. అయితే కోడి పదాలు ఏపీలో ఎక్కువగా జరుగుతుంటాయి. పండుగకు నెల ముందే పందెం రాయుళ్లు కావలసిన ఏర్పాట్లు చేస్తుంటారు.

చదవండి : Cock Birthday : గ్రాండ్‌గా కోడిపుంజు బర్త్ డే.. వీడియో వైరల్

అయితే ఇంతకాలం ఏపీకే పరిమితమైన కోడి పందాల సంప్రదాయం తెలంగాణకు పాకింది. గతంలో ఖమ్మం జిల్లా మధిరలో కోడిపందాలు ఆడుతున్న కొందరిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే అధికారుల కళ్లుకప్పి కొందరు కోడిపందాలు నిర్వహిస్తున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాదర్గుల్ వద్ద బహిరంగ కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.

చదవండి : Cock Fight : పందెం కోళ్లను మేపుతున్న పోలీసులు

దీంతో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నలభై ఎనిమిది వేల రూపాయల నగదుతోపాటు 13 కోళ్లను, 30 కోడి పందెం కత్తులను, మూడు బైక్‍‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం అరెస్ట్ చేసిన 10 మందిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు.

చదవండి : Monoclonal Antibody Cocktail : గేమ్ ఛేంజర్ డ్రగ్? : మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్‌మెంట్ సక్సెస్!