Cock Fight : పందెం కోళ్లను మేపుతున్న పోలీసులు

పందెం కోళ్లను, ఇంటి అల్లుళ్లను మేపినట్లు మేపుతూ వాటిని కాపలా కాస్తున్నారు పోలీసులు.

Cock Fight : పందెం కోళ్లను మేపుతున్న పోలీసులు

Cock Fight

Updated On : October 29, 2021 / 1:09 PM IST

Cock Fight : పందెం కోళ్లను, ఇంటి అల్లుళ్లను మేపినట్లు మేపుతూ వాటిని కాపలా కాస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  పాల్వంచ మండలం దంతలబోరు అటవీ ప్రాంతంలో   కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులకు ఈనెల 25న సమాచారం అందింది.

పాల్వంచ రూరల్ ఎస్సై సుమన్ తన సిబ్బందితో   కోడి పందాలపై   దాడి చేసి మూడు పందెం కోళ్లతోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు.  అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి వారిని విడిచి పెట్టారు. కోడి పుంజులను కిన్నెరసాని రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

Also Read : Husband Harassment : భర్త అరాచకం : అర్ధనగ్నంగా ఉండమంటాడు..మూత్రం తాగమంటాడు

అప్పటి నుంచి కోడి పుంజులకు రేషన్ బియ్యం అందిస్తూ  స్టేషన్‌లోనే కట్టేసి  వాటిని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కోడిపుంజుల రంగుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హజరు పరుస్తామని, తదుపరి ఆదేశాల  మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెపుతున్నారు.