Telangana Congress: ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఈ ప్రయోగం ఎందుకు.. సూర్యం అంగీకరిస్తారా?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో విజయం సాధించిన ఊపులో.. తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది.

Telangana Congress: ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఈ ప్రయోగం ఎందుకు.. సూర్యం అంగీకరిస్తారా?

Gaddar, KCR

Telangana Congress – Gaddar son: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ నయా ప్లాన్ రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS Party) బాస్‌కు ప్రత్యర్థిగా ప్రజా సంఘాలతో సన్నిహిత సంబందాలున్న నాయకుడిని తెరపైకి తేవాలని చూస్తోంది.. కర్ణాటక ఫార్ములాను (Karnataka Formula) ఇక్కడ కూడా అమలు చేసేందుకు స్కెచ్ వేస్తోంది. కర్ణాటకలో ప్రజా సంఘాలను కేవలం ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే వాడుకోగా.. ఇక్కడ ఏకంగా పోటీకి దింపాలనే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఈ ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నదెవరు? ముఖ్యమంత్రిపై పోటీకి ఆ నేతనే ఎంచుకోడానికి కారణమేంటి?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో విజయం సాధించిన ఊపులో.. తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ.. అయితే కర్ణాటక కన్నా భిన్నంగా ఇక్కడ ప్రజా సంఘాల నాయకులను వీలైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పెట్టాలని చూడటమే రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తర్వాత.. ఆయన కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ… గద్దర్‌తో తమ పార్టీకి ఎంతో అనుబంధం ఉందని చెప్పాలని భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజా సంఘాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధాలు ఉన్నా.. అధికార బీఆర్ఎస్ వాడుకున్న స్థాయిలో ప్రజా సంఘాల బలాన్ని ఎప్పుడూ వాడుకోలేకపోయింది కాంగ్రెస్. కానీ కర్ణాటక ఎన్నికల్లో వారే క్రియాశీలంగా పనిచేశారని గుర్తించిన కాంగ్రెస్ అదే ఫార్ములాను ఇక్కడ అవలంబించాలని నిర్ణయించింది.

Also Read: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!

చైతన్యానికి మారుపేరైన తెలంగాణ సమాజంలో అధికార బీఆర్ఎస్, ప్రజా సంఘాలకు మధ్య కాస్త గ్యాప్ ఉందనే విషయాన్ని గ్రహించింది కాంగ్రెస్. ఉద్యమకారులకు బీఆర్ఎస్‌లో న్యాయం జరగలేదని ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ఉద్యమకారులను ఆకర్షించే వ్యూహంలో భాగంగా దివంగత ప్రజా యుద్ధనౌక గద్దర్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపింది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి బరిలోకి దింపాలని అనుకున్నది. కానీ, ఇంతలో ఆయన అకాల మరణంతో వ్యూహం మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. గద్దర్‌కు బదులుగా ఆయన కుమారుడు సూర్యంను గజ్వేల్లో పోటీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ప్రతిపాదనకు సూర్యం అంగీకరిస్తారో, లేదో గాని.. గద్దర్‌ బతికుంటే ఆయన్నే పోటీకి పెట్టాలనే ఆలోచన మాత్రం పంచుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే తండ్రి స్థానంలో పోటీకి రెడీ అవ్వాలని గద్దర్ కుమారుడు సూర్యంను కోరుతున్నారు కాంగ్రెస్ నేతలు.

Also Read: వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు

గద్దర్ స్వస్థలం తుప్రాన్.. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఉంటోంది. అందుకే ఇక్కడి నుంచి గద్దర్‌ను పోటీకి పెట్టాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్‌. ఇప్పుడు ఆయన మరణంతో గద్దర్ వారసుడిని బరిలోకి దింపి ప్రజా యుద్ధనౌక మరణంతో వచ్చిన సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. అదేవిధంగా ప్రజా సంఘాలకు.. ఉద్యమకారులకు కాంగ్రెస్‌లోనే స్వేచ్ఛ ఉంటుందనే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ ప్లాన్ ఎంతవరకు వర్క్వుట్ అవుతుందో గాని.. ప్రస్తుతానికి ఈ ప్రచారం రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది.