G.Niranjan : తనిఖీల పేరుతో ఎన్నికలకు సంబంధంలేని డబ్బు, బంగారం స్వాధీనం.. ఈసీకి లేఖ రాసిన కాంగ్రెస్ నేత జి.నిరంజన్
వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని తెలిపారు.

G.Niranjan letter to CEC (1)
G.Niranjan Letter CEC : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ మేరకు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ లేఖ రాశారు. తనిఖీల పేరుతో ఎన్నికలకు సంబంధం లేని డబ్బు, బంగారం స్వాధీనం చేసుకోవడంపై లేఖ రాశారు. ప్రభుత్వ యంత్రాంగం తీరుతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, మానసికంగా వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం తెలంగాణలోని అన్ని శాఖల అధికారులతో అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో వరుస సమావేశాలు నిర్వహించిందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో డబ్బును కట్టడి చేయడంలో అధికారుల వైఫల్యంపై ఈసీ అసంతృప్తి అంటూ వార్తలొచ్చాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీన షెడ్యూల్ విడుదల నాటి నుంచి ఎమ్‌సీసీని కఠినంగా అమలు చేస్తున్నామని చూపించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. వాహనాలను తనిఖీ చేయడం, ఎన్నికలకు సంబంధం లేని డబ్బును స్వాధీనం చేసుకోవడం ద్వారా సామాన్య ప్రజలపై కొరడా ఝులిపిస్తున్నారని తెలిపారు.
Assembly Elections 2023: తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అభ్యర్థుల్ని మార్చనున్న కాంగ్రెస్, బీజేపీ!
వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని తెలిపారు. కానీ, రోజువారీ వ్యక్తిగత, వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకి సృష్టిస్తూ సామాన్యుడిని కష్టాల్లోకి నెట్టడం ఈసీ ఉద్దేశ్యం కాదన్నారు.
నగదు సీజ్ చేసే ముందు ఎన్నికల కోసం ఉద్దేశించిందా? కాదా? అని నిర్ధారించుకోవాలని సూచించారు. 2018లో ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న సొమ్ములో 90శాతం తిరిగి ఇచ్చినట్లు మీడియాలో చూశానని తెలిపారు. అంటే ఒక వ్యక్తి తన డబ్బును తిరిగి పొందడానికి 50 రోజులకుపైగా వేచి చూడాల్సి వస్తోందన్నారు.
Kamareddy Farmers : సీఎం కేసీఆర్ పై 100 మంది కామారెడ్డి జిల్లా రైతులు పోటీ!
అధికారులు వ్యాపార ప్రాంతాలు, వైన్ షాపులు, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద తనిఖీలు నిర్వహించి డబ్బును సీజ్ చేస్తున్నారని, ఆ తరువాత ఎక్కడో తనిఖీ చేస్తుండగా దొరికినట్లు తెలియచేసే రషీదులు ఇస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, సంబంధిత అధికారులను ఆదేశించాలని తాము ఈసీని కోరుతున్నామని పేర్కొన్నారు.