CM KCR : సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి
Assembly Election 2023 Updates: కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.

CM KCR
Nagam Janardhan Reddy..Vishnuvardhan Reddy joined BRS : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలో టికెట్ దక్కని అసంతృప్తులు హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంట్లో భాగంగా నాగం జనార్ధన్ రెడ్డి, దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా గులాబీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..నాగం జనార్ధన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందని..ఎన్నో సార్లు జైలుకు వెళ్లిన నేపథ్యం ఉందని అన్నారు. నేను ప్రత్యేకించి నాగంను రిక్వెస్ట్ చేశానని తన మాటను గౌరవించి ఆయన పార్టీలో చేయటం సంతోషంగా ఉందన్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి కూడా పార్టీలో చేరటం సంతోషమన్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి భవిష్యత్తు నాది బాధ్యత అంటూ గులాబీ బాస్ భరోసా ఇచ్చారు. విష్ణు తండ్రి పీజేఆర్ తనకు మంచి మిత్రుడు అంటూ ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ తనయుడు నా కుటుంబ సభ్యుడు అంటూ చెప్పుకొచ్చారు. నాగం పార్టీలో చేయటంతో బలం మరింత పెరిగిందన్నారు.
Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్
మహబూబ్ నాగర్ లో 14 స్థానాలు గెలవాలని అన్నారు.గోపీనాథ్, విష్ణు కలిసి పనిచేయండి..అందర్నీ కలుపుకుంటూ ముందుకెళ్లి పనిచేయండి అంటూ సూచించారు.తెలంగాణ అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు. ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నీ చంపాలని చూసారు అంటూ మండిపడ్డారు. కానీ దేవుడి దయ వల్ల ప్రభాకర్ బ్రతికి బయట పడ్డాడని ఇటువంటి హత్యా రాజకీయాలన్ని సహించబోము అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, పీజేఆర్ తనయుడు.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి తదితరులు#KCROnceAgain pic.twitter.com/bxB62amUnM
— BRS Party (@BRSparty) October 31, 2023