ఏం బరితెగింపు : రూ.200 కోట్లు కొట్టేసిన చిట్ ఫండ్

  • Published By: Mahesh ,Published On : December 19, 2018 / 02:11 PM IST
ఏం బరితెగింపు : రూ.200 కోట్లు కొట్టేసిన చిట్ ఫండ్

Updated On : December 19, 2018 / 2:11 PM IST

హైదరాబాద్ లోని శ్రీ రిషబ్ చిట్ ఫండ్స్ యాజమాన్యం ఖాతాదారులను 200 కోట్ల రూపాయల మేర  మోసం చేసి పరారయ్యింది. శ్రీరిషబ్ చిట్ ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహాకులు శైలేశ్ గుజ్జార్, అతని భార్య నందిని లపై బాధితులు సీసీఎస్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసారు.అత్యధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు  చెప్పారు. చిట్టీలు పాడుకున్నపాట దారులకు కూడా డబ్బు చెల్లించకుండా ఆడబ్బును డిపాజిట్లుగా మార్చుకున్నట్లు బాధితులు తెలిపారు. బాధితులలో ఎక్కవమంది దిగువ మధ్యతరగతి ప్రజలు, రోజువారి కూలీ చేసుకునే వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 2సంవత్సరాలుగా ఖాతాదారులను వడ్డీ కూడా చెల్లించట్లేదని భాధితులు చెప్పారు.