Corona in Telangana : తెలంగాణలో కొత్తగా 1052 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మంగళవారం రాష్ట్రంలో 1052 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Corona in Telangana : తెలంగాణలో కొత్తగా 1052 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Corona in Telangana

Updated On : January 5, 2022 / 12:57 AM IST

Corona in Telangana : తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మంగళవారం జనవరి 4, 2022 రోజున తెలంగాణలో 1052 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందగా 240 మంది కోలుకున్నట్లు తెలిపారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,858 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు.

చదవండి : Corona : ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

ఇక తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని 6,84,023కు చేరాయి. ఇందులో 6,75,132 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక మంగళవారం రాష్ట్రంలో 42,991 శాంపిల్స్ పరీక్షించారు వైద్య సిబ్బంది. సాధారణ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా భయపడుతున్నాయి. తెలంగాణలో 10 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 92కు పెరిగింది.

చదవండి : Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?