Corona : ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీహెచ్ చెప్పారు

Corona
Corona : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీహెచ్ చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తోందని కోర్టుకి తెలిపారు. ”రాష్ట్రంలో ఈ నెల 1 నాటికి 2.97 కోట్ల కరోనా పరీక్షలు చేశాము. రాష్ట్రంలో మొత్తం 6,82,215 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.29శాతం, మరణాల రేటు 0.5 శాతం. రాష్ట్రంలో 34 ప్రభుత్వ, 76 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్, 1231 రాపిడ్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. గత నెలలో రోజుకు సుమారు 35వేల 129 పరీక్షలు చేశాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగింది. టీకా మొదటి డోసు 100శాతం, రెండో డోసు 69శాతం పూర్తైంది” అని హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో డీహెచ్ తెలిపారు.
Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్‌లో వేలు పెట్టమన్న “అలెక్సా”
హైకోర్టులో కొవిడ్, ఓమిక్రాన్ కేసులపై విచారణ జరిగింది. హెల్త్ డైరెక్టర్, డీజీపిలు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కొవిడ్ విజృంభించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు ఎన్ని జరిమానాలు విధించారు, ఎన్ని కేసులు నమోదు చేశామో నివేదికలో పేర్కొన్నారు డీజీపీ. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, థర్డ్ వేవ్ లో తీసుకుంటున్న చర్యలపై నివేదికలో పేర్కొన్నారు హెల్త్ డైరెక్టర్.
విద్యాసంస్థలను మూసివేసి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటీషనర్. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని, స్కూలు విద్యార్థులకు ఇంకా వ్యాక్సినేషన్ రాలేదన్న అంశాలను హైకోర్టు ముందు ఉంచారు పిటీషనర్. థర్డ్ వేవ్ పెరిగితే చిన్నారులే ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉందని పిటీషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Benefits Of Onion : ఉల్లిపాయతో ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే…
ఇతర రాష్ట్రాల మాదిరిగా కోర్టులను కూడా వర్చ్యువల్ గా నిర్వహించాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటీషనర్. క్లయింట్లను, అడ్వకేట్లను కోర్టు లోపలికి అనుమతించడం ద్వారా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. పిటీషనర్ అభ్యంతరాలపై సమగ్ర నివేదికను ఈ నెల 7న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.