Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?

ఈ వైరస్‌లో 45 కొత్త మ్యుటేషన్లు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ వ్యాపించడం మొదలు పెడితే పరిస్థితులు.. ఒమిక్రాన్ కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?

Corona New Variant Ihu

Corona New Variant IHU : కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, మానవాళిని వెంటాడుతూనే ఉంది. మనుషులను ముప్పుతిప్పలు పెడుతోంది. కొత్త రూపాల్లో ఈ మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. డెల్టా వేరియంట్ కొన్నాళ్లు వణికించింది. దాన్ని నుంచి తేరుకునేలోపే మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చిపడింది. ఒమిక్రాన్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ చెమట్లు పట్టిస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్‌లో వేలు పెట్టమన్న “అలెక్సా”

కరోనా కొత్త వేరియంట్‌ను (బి.1.640.2) వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్‌ను ఫ్రాన్స్‌లో గుర్తించారు. దీన్ని IHU వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఇది ఒమిక్రాన్ కంటే డేంజర్ అని అంటున్నారు. కామెరూన్ నుంచి వ్యక్తి ద్వారా ఈ వేరియంట్ ఫ్రాన్స్ లోకి ప్రవేశించింది. ఇప్పటికే 12మంది దీని బారిన పడ్డారు. ఈ వైరస్‌లో 45 కొత్త మ్యుటేషన్లు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ వ్యాపించడం మొదలు పెడితే పరిస్థితులు.. ఒమిక్రాన్ కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

Pani Puri : స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదేనా?

తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి రూపం మార్చుకుని మళ్లీ బుసలు కొడుతోంది. గతేడాది నవంబర్ లో దక్షిణాఫ్రికాలో బీ 1.1.529 కరోనా వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగున్న ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. మొన్నటి దాకా అత్యంత ప్రమాద కారిగా డెల్టా వేరియంట్‌ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌‌ను తలదన్నే.. ఒమిక్రాన్‌.. ఆందోళనకు గురి చేస్తోంది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు ఫ్రాన్స్ లో వెలుగుచూసిన కొత్త వేరియంట్ మరింత టెన్షన్ పెడుతోంది.