Corona Effect : దేవుళ్లపై కరోనా ఎఫెక్ట్..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఉప్పుడు దేవుళ్లపై కూడా పడింది. ఏడాదికోసారి ఆనందంగా అందరితో కలిసి చేసుకునే పండుగలు... ఇప్పుడు ప్రజలు ఇంట్లో ఏకాంతంగా జరుపుకుంటున్నారు.

Corona Effect On The Gods Restrictions On Festivals
Corona effect on the gods : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఉప్పుడు దేవుళ్లపై కూడా పడింది. ఏడాదికోసారి ఆనందంగా అందరితో కలిసి చేసుకునే పండుగలు… ఇప్పుడు ప్రజలు ఇంట్లో ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రంజాన్ ఆలింగనాలు.. ఉగాది పంచాంగ శ్రవణాలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక సీతారాముల కళ్యాణాన్ని టీవీల్లో చూసి… ఆన్‌లైన్‌లో తలంబ్రాలు బుక్ చేసుకోవాల్సిందే. వైరస్ వ్యాప్తి ప్రారంభమై ఏడాది దాటినా.. కోవిడ్ భూతం మాత్రం ప్రజలను వదిలిపెట్టడంలేదు. దేశ వ్యాప్తంగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలకు నడుం బిగించాయి.
ఏప్రిల్ 30 వరకు వచ్చే అన్ని పండుగలపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఏడాదికోసారి ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ .. గతేడాది లాగే … ఈ సారి కూడా ఒంటరిగా జరుపుకోవాల్సిందే. వేలాది మంది కలిసి సామూహికంగా జరుపుకునే రంజాన్ ప్రార్థనలు… ఈ సారి కూడా ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవాల్సిందే.
ఇక ఉగాది, శ్రీరామనవమి పండుగలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉగాది పంచాంగ శ్రవణం, నవమి రోజున సీతారాముల కళ్యాణం పూర్తిగా ఏకాంతంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇక మహావీర్ జయంతి రోజున జైనులు పెద్ద ఎత్తున నిర్వహించే ఊరేగింపులపై కూడా ఆంక్షలు విధించింది.