సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారికి కరోనా…తెలంగాణలో 41కి పెరిగిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.

  • Published By: veegamteam ,Published On : March 25, 2020 / 05:11 PM IST
సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారికి కరోనా…తెలంగాణలో 41కి పెరిగిన కేసులు

Updated On : March 25, 2020 / 5:11 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41 కి చేరింది. బుధవారం (మార్చి 25, 2020) ఉదయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పాజిటివ్ కేసు లేదని ప్రత్యేకంగా ఒక బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. కొద్ది సేపటి క్రితమే మరో బులిటెన్ విడుదల చేసింది. మరో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. 

అందులో ఒకటి ప్రైమరీ కాంటాక్టుగా ఒక మహిళ, మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన 41 కేసుల్లో 3 సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం మొట్టమొదటిదిగా చెప్పవచ్చు. ఈ చిన్నారి సౌది అరేబియా నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంటాక్టు కేసుల లిస్టు కూడా పెరుగుతోంది. నిన్నటి వరకు ఐదు కాంటాక్టు కేసులు ఉండగా ఇవాళ ఆరో కాంటాక్టుగా 43 ఏళ్ల మహిళ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు 50 మంది పరీక్షలు, ఐసోలేషన్ కోసం అడ్మిట్ అయ్యారు. 

ఇప్పటివరకు మొత్తంగా ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు సంబంధించిన లిస్టును ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఐసోలేషన్ వార్డుల్లో 813 రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ కొంత తగ్గిస్తుందున్న సమయంలో మళ్లీ ఇప్పుడు మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భయాందోళన మరింత పెరిగిందని చెప్పవచ్చు. 

మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు.

లాక్‌డౌన్‌ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
 

Also Read | హాస్టళ్ల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దు : తెలంగాణ డీజీపీ