Covid Free Village: తెలంగాణలో కరోనా లేని గ్రామం ఇదే!

దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావంతో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు మరణిస్తున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

Covid Free Village: తెలంగాణలో కరోనా లేని గ్రామం ఇదే!

Covid Free Village

Updated On : May 14, 2021 / 5:24 PM IST

Covid Free Village: దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావంతో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు మరణిస్తున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

వేవ్ లమీద వేవ్ లు వచ్చిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని దమ్మాయిపేట గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట.. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో ఫస్ట్, సెకండ్ వేవ్ లలో కరోనా కేసులే రాలేదట.. దీనికి కారణం గ్రామస్తుల ఐక్యమత్యమే అంటున్నారు గ్రామ పెద్దలు.

కరోనా ఉదృతి మొదలవకముందే గ్రామంలోని ప్రజలందరికి మాస్కులు పంచారు సర్పంచ్.. ఇక పక్క గ్రామాల నుంచి దమ్మాయి పేట వచ్చేవారిని గ్రామ సరిహద్దుల్లోని ఆపేస్తున్నారు. గ్రామంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. గ్రామంలోని దుకాణ దారులు సరుకుల కోసం బయటకు వెళ్ళినప్పుడు వారిని తగిన జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించారు.

ఆలా ప్రజల సహకారంతో కట్టుదిట్టం చేసి కరోనాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు.