ఆదిలాబాద్ కలెక్టర్ కారుకు ఎదురుగా వెళ్లిన కరోనా రోగి

నాకు కరోనా ఉంది..తన దగ్గరకు ఎవరూ రావడం లేదు మేడమ్. సొంత స్నేహితులు, గ్రామస్థులు దూరంగా పెడుతున్నారు..నా సమస్య పరిష్కరించండి..అంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కారుకు అడ్డంగా ఓ వ్యక్తి నిలబడ్డాడు.
కరోనా వచ్చిన వారిని వెలివేయవద్దని, వారి పట్ల వివక్ష చూపవద్దని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా..కొంతమంది మానవత్వాన్ని మరిచిపోతున్నారు. వారిని దూరంగా పెడుతున్నారు. గ్రామాల్లో కరోనా రోగుల పట్ల వివక్ష చూపుతున్నారు. స్థానికులు దూరంగా పెడుతున్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాగ్వాదానికి దిగారు. భీమ్ పూర్ మండలంలోని కమన్ త్వాడలో దేవిదాస్ అనే వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆరు రోజులుగా హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. ఉన్నట్టుండి వంట గ్యాస్ అయిపోయింది. దీంతో తనకు గ్యాస్ సిలిండర్ తెచ్చివ్వాలని కోరాడు. అతను నిరాకరించాడు. గ్రామస్తలను అడిగాడు.
వారు కూడా దూరం పెట్టారు. అందరూ సాయం చేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. జిల్లా అధికార యంత్రాగానికి తెలియచేయాలని అనుకున్నాడు. గ్యాస్ సిలిండర్ తీసుకుని బయలుదేరాడు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కారులో వెళుతున్నారు. వెంటనే దేవిదాస్ కలెక్టర్ కారుకు అడ్డంగా నిలబడ్డాడు.
తనకు జరిగిన పరిస్థితులను వివరించాడు. అక్కడున్న పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. తన సమస్య పరిష్కరించాలని కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. చివరకు పరిష్కరిస్తానని కలెక్టర్ హామీనిచ్చారు.