క్రికెట్ ఆడిన సీపీ అంజనీకుమార్..సెంచరీ కొట్టాడు

CP Anjanikumar played cricket : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ క్రికెట్ ఆడారు. పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా అబిడ్స్ సాగర్ ప్లాజా ఇండోర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్ మ్యాచ్ ఆడిన అంజనీకుమార్ సెంచరీ (126) కొట్టారు. క్రికెట్ ప్లేయర్ లాగే అద్భుతంగా ఆడి అందరినీ ఆకర్షించారు. గ్రౌండ్ లో పరుగుల వర్షం కురిపించారు.
క్రమశిక్షణతో బాల్‌ను టార్గెట్ చేయడంతోనే ఈ సెంచరీ సాధించానని.. హైదరాబాద్ సేఫ్టీ కోసం క్రిమినల్స్‌ను ఇలాగే టార్గెట్ చేస్తామన్నారు. పోలీసులు, మీడియాకు మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో మీడియా టీం గెలుపొందింది.