బీఫార్మసీ విద్యార్థిని కట్టుకథ అల్లింది : సీపీ మహేష్ భగవత్

బీఫార్మసీ విద్యార్థిని కట్టుకథ అల్లింది : సీపీ మహేష్ భగవత్

Updated On : February 13, 2021 / 1:23 PM IST

CP Mahesh Bhagwat respond on b.pharmacy student incident : ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని కేసును ఫాల్స్ గా పోలీసులు నిర్ధారించారు. బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. విద్యార్థినిపై కిడ్నాప్, అత్యాచారం జరిగిందన్నది అవాస్తవం అన్నారు. కావాలనే యువతి కట్టుకథలు అల్లిందని తెలిపారు. ఘట్ కేసర్ విద్యార్థిని ఘటనపై శనివారం (ఫిబ్రవరి 13,2021) సీపీ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి చెప్పినవిధంగా ఘటన జరిగినట్లు ఆధారాలు లేవన్నారు. విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడి అబద్ధం చెప్పిందని తెలిపారు. విద్యార్థిని చెప్పిన విధంగా ఘటన జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు.

10 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చిందని తెలిపారు. యువతిని ఆటోవాళ్లు కిడ్నాప్ చేశారనే కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదు రాగానే పోలీసులు అలర్ట్ అయ్యారని తెలిపారు. పోలీసులు వెళ్లేసరికి యువతి స్పృహ కోల్పోయి ఉందన్నారు. రాత్రి 7.50 గంటలకు యవతి సెల్ ఫోన్ రెస్పాండ్ అయిందని చెప్పారు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు చెప్పిందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ తో గతంలో వివాదాలున్నాయని విద్యార్థిని చెప్పినట్లు వెల్లడించారు.

100 సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించినట్లు ప్రకటించారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఎటువంటి ఆధారాలు లభ్యమవ్వలేదన్నారు. కుటుంబ వివాదంతోనే యువతి బయటకు వెళ్లిందని చెప్పారు. పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణలో అదంతా అవాస్తమని తేలిందని చెప్పారు. కొందరు అనుమానితుల్ని గుర్తించామని చెప్పారు. కేసులో విచారించిన ఆటో డ్రైవర్లకు మహేశ్ భగవత్ క్షమాపణలు చెప్పారు.