తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే ప్రమాణం చేయించారు.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్

Telangana Governor Radhakrishnan

Telangana Governor Radhakrishnan : తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత మూడురోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ నూతన గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సీ.పీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇవాళ ఉదయం ఆయన తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్.. తాజా కీలక అంశాలివే..!

సీపీ రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1998, 1999) బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆల్ ఇండియా కోయిర్ బోర్డ్ కు అధ్యక్షత వహించారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియామకం అయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు మేరకు తెలంగాణ గవర్నర్ గా బుధవారం రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టారు.