ప్లాట్‌ఫాం టికెట్‌పై శుభవార్త.. 115 స్పెషల్ రైళ్లలో మాత్రం అదనపు చార్జీలు
ఈసారి ఫ్లాట్‌ఫాం టికెట్‌కు అదనపు చార్జీల వసూలు లేదు.. అయితే, ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం స్టేషన్ వద్దకు రావద్దు..

Sankranti Trains
Sankranti Trains: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనిపై హైదరాబాద్‌లో 10 టీవీతో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతికి 115 స్పెషల్ రైళ్లు ఉంటాయన్నారు.
పూర్తి వివరాలు
- సికింద్రాబాద్, హైద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్స్ నుంచి నడవనున్న స్పెషల్ రైళ్లు
- సౌత్ సెంట్రల్ పరిధిలో ఈ నెల 7 నుంచి ప్రారంభమైన స్పెషల్ రైల్ సర్వీసులు 20 వరకు ఉంటాయి
- స్పెషల్ రైలు సర్వీసులు జనవరి చివరివారం వరకు అందుబాటులో ఉంటాయి
- సంక్రాంతి స్పెషల్ రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తారు.. సాధారణ రైళ్లలో మాత్రం రెగ్యులర్ చార్జీలు ఉంటాయి
- ఈసారి ప్లాట్‌ఫాం టికెట్‌కు అదనపు చార్జీల వసూలు లేదు..
- ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం స్టేషన్ వద్దకు రావద్దు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల తో పాటు నగర శివారు ప్రాంతాల రైల్వే స్టేషన్ల నుంచి సంక్రాంతి స్పెషల్ రైల్ అందుబాటులో ఉంటాయి..
- ఈ సంక్రాంతికి వందే భారత్ రైల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి..
- ఏపి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపూర్, తిరుపతి వంటి ప్రధాన రూట్లలో ఫెస్టివల్ డిమాండ్ ను బట్టి అదనపు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు..
- ఎంటీఎస్ వెబ్ సైట్, యూటీస్ మొబైల్ యాప్ ద్వారా ట్రైన్స్ టికెట్స్ బుక్ చేసుకునే వెసులుబాటు
- సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్‌లో పండగ సందర్భంగా అడిషనల్ స్టాఫ్‌తో సెక్యూరిటీ పెంచుతూ మానిటర్
Also Read : తిరుమల శ్రీవారికి తలనీలాలు అర్పించిన నటి.. గుండుతో సురేఖవాణి..